NTV Telugu Site icon

దూసుకొచ్చిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు.

READ ALSO బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..

ఇటీవల నార్సింగి ప్రాంతంలోనూ మద్యం మత్తులో వాహనం నడిపి భార్యభార్తల మరణానికి కారణమయ్యాడో మందుబాబు. నగరంలో మందుబాబులు వీరంగం చేశారు. బంజారాహిల్స్‌లో తాగుబోతులు బీభత్సం కలిగించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి బంజారాహిల్స్ వరకు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో ఆటో నడిపి పలువురిని మందుబాబులు ఢీకొట్టారు. ఇద్దరిని గాయపరిచారు. రోడ్డుపై వున్న వాహనదారుల సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దాడిచేసి పారిపోతున్న మందుబాబులను స్థానికులు పట్టుకున్నారు. అయితే స్థానికులపై మందుబాబులు తిరగబడడంతో ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారం క్రితం హైదరాబాద్ లో రెండు వేర్వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మందుబాబులు రెచ్చిపోతుండడంతో ప్రమాదాల బారిన పడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మందుబాబుల ఆగడాలు అరికట్టాలని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని జనం కోరుతున్నారు.