Site icon NTV Telugu

జైకోవ్ డీ వ్యాక్సిన్ రెడీ… తొలుత ఆ ఏడు రాష్ట్రాల్లోనే…  

గుజ‌రాత్‌కు చెందిన జైడ‌స్ క్యాడిలా ఫార్మా సంస్థ క‌రోనా మ‌హ‌మ్మారికి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ వ్యాక్సిన్‌కు ఆగ‌స్ట్ 20 వ‌తేదీన అనుమ‌తులు ల‌భించాయి.  మూడో డోసుల వ్యాక్సిన్‌.  అంతేకాదు, సూదితో ప‌నిలేకుండా జెట్ అప్లికేట‌ర్ ప‌రిక‌రంతో వ్యాక్సిన్‌ను అందిస్తారు.  12 ఏళ్లు పైబ‌డిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందించ‌నున్నారు.  ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కోటి డోసుల‌కు ఆర్డ‌ర్ చేసింది.  జైకోవ్ డీ వ్యాక్సిన్ ను మొద‌ట దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు అందించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ది.  బీహార్, ఝార్ఖండ్‌, పంజాబ్‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధం అవుతున్నారు.  

Read: ముప్పు గురించి హెచ్చ‌రిస్తే… ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారా?

ఇప్ప‌టికే మూడు డోసుల వ్యాక్సిన్‌కు సంబందించి ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ కూడా ఇచ్చారు.  ఇక ఒక్కోడోసు ప్ర‌భుత్వం రూ.265 చొప్పున కొనుగోలు చేసింది.  దీనితో పాటు జెట్ అప్లికేట‌ర్‌కు అద‌నంగా మ‌రో రూ.93 చెల్లించింది.  అంటే ఒక్కో డోసును కేంద్రం రూ. 358కి కోనుగోలు చేసింది.  మొత్తం మొద‌టి విడ‌త‌గా కోటి డోసుల‌కు ఆర్డ‌ర్ చేసింది.  త్వ‌ర‌లోనే ఈ వ్యాక్సిన్ డోసుల‌ను ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.  

Exit mobile version