NTV Telugu Site icon

వావ్‌: రెండే నిమిషాల్లో విప్పేసి… మ‌ళ్లీ బిగించారు…

దేశంలో ఎలాంటి విప‌త్తులు సంభ‌వించినా వెంట‌నే రెస్పాండ్ అయ్యేది ఎవ‌రు అంటే ఆర్మీ అని చెప్తారు. వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో ఆర్మీ ముందు ఉండి ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుంది.  సాహ‌సాలు చేయ‌డంలోనూ సైనికులు ముందు ఉంటారు.  ఇంజ‌నీరింగ్ రంగంలోనూ సైనికులు అందించే సేవ మ‌రువ‌లేనిది.  వంతెన‌లు నిర్మించ‌డంలో, రోడ్లు వేయ‌డంలో, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో కార్ల‌కు రిపేర్లు చేయ‌డంలోనూ ఆర్మీ ముందు ఉంటుంది.  బీఎస్ఎఫ్ జ‌వాన్లు ఎక్కువ‌గా వినియోగించే వాహ‌నాల్లో ఒక‌టి మారుతి జిప్సీ.  

Read: గూగుల్‌లో ఎక్కువ‌మంది సెర్చ్ చేసిన ప‌దాలు ఇవే…

ఎలాంటి రోడ్ల‌పైన అయినా స‌రే ఈ వాహ‌నం చాలా ఈజీగా ప్ర‌యాణం చేయ‌గ‌ల‌దు.  రిపేర్ వ‌చ్చినా వెంట‌నే స‌రిదిద్దుకునే విధంగా ఈ వాహ‌నాలు ఉంటాయి.  అందుకే బీఎస్ఎఫ్ జ‌వాన్లు ఈ వాహ‌నాన్ని అధికంగా వినియోగిస్తుంటారు.  ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో బీఎస్ఎఫ్ జ‌వాన్లు త‌మ నైపుణ్యాన్ని చాటుకున్నారు.  రెండు నిమిషాల వ్య‌వ‌ధిలోనే వారు ప్ర‌యాణం చేసే జిప్సీని పార్టు పార్టులుగా విప్పేసి, మ‌ర‌లా బిగించారు.  దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న‌ది.