తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఏడాది దృష్ట్యా పార్టీ కార్యాచరణ, ప్రతిపక్షాలను ఎదుర్కోవడంపై నేతలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : YS Viveka Murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. ఈ క్రమంలో ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులను.. ఈ సమావేశంలో ఖండించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల తీరు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్విస్తరణ సహా ఇతర అంశాలపై కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
