NTV Telugu Site icon

వైర‌ల్‌: వీడి ఆత్రం త‌గ‌ల‌య్య‌… పెళ్లి మండ‌పంలోనే…

పెళ్లిని స్వ‌ర్గంలో నిర్ణ‌యిస్తారు అంటారు.  పెళ్లికి ముందు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉన్నా, లేకున్నా పెళ్లి మండ‌పంలో కొన్ని ప‌ద్ద‌తుల‌ను తప్ప‌నిస‌రిగా పాటిస్తారు.  ఎంత ప‌రిచ‌యం ఉన్న‌ప్ప‌టికీ పెళ్లి పూర్త‌య్యే వ‌ర‌కు ప‌రిచ‌యం లేన‌ట్టుగానే ఉంటారు.  పెళ్లిళ్ల యందు ఈ పెళ్లిళ్లు వేర‌యా అన్న‌ట్టుగా జ‌రిగింది ఈ పెళ్లి.  కొన్ని ర‌కాల పెళ్లిళ్ల‌లో పెళ్లి స‌మ‌యంతో ముద్దు పెట్టుకుంటారు.అదీ వారి ఆచారం ప్ర‌కార‌మే.  కానీ, హిందూ వివాహాల్లో ఇలాంటి వాటిని అస్స‌లు ఒప్పుకోరు. పెళ్లి మండ‌పం మొత్తం బంధువుల‌తో నిండిపోయి ఉంటుంది.  క‌నీసం ముట్టుకోవ‌డానికి కూడా అనుమ‌తించ‌రు.  కానీ, ఈ పెళ్లిలో వ‌రుడు అంత‌కు మించి అనేలా ప్ర‌వ‌ర్తించాడు.  

Read: అభిమానులే అతిథులుగా 23న ‘రాధే శ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్

పెళ్లి జ‌రుగుతున్న స‌మ‌యంలో వ‌రుడు వ‌ధువును గ‌ట్టిగా హ‌గ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. పెళ్లికి విచ్చేసిన వారిలో కొంత‌మంది వ‌ధువును ముద్దుపెట్టుకోవాల‌ని వ‌రుడికి చెప్పారు.  చుట్టూ బంధువులు, అతిధులు ఉన్న‌ప్ప‌టికీ అవేమి ప‌ట్టించుకోకుండా వ‌ధువును గట్టిగా హ‌గ్ చేసుకొని ముద్దుపెట్టాడు.  అటు వ‌ధువు కూడా అత‌నికి స‌హ‌క‌రించింది.  దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఒక్క‌సారిగా వైర‌ల్ గా మారింది.  ఇదేం పిచ్చిప‌ని అని నెటిజ‌న్లు తిట్టిపోశారు.  పెళ్లి పూర్త‌య్యే వ‌ర‌కు ఆగొచ్చుక‌దా అని కొంద‌రు కామెంట్స్ చేశారు. 

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి