ఐపీఎల్ 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ న్యాయకత్వంలో టైటిల్ ను అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్ళీ ఇప్పటివరకు దానిని సొంతం చేసుకోలేకపోయింది. ఇక వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. దాంతో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమ వెంట ఉంచుకున్న సన్ రైజర్స్ కోచింగ్ స్టాఫ్ లో కూడా భారీగా మార్పులు చేసింది.
అయితే గత ఏడాది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు ఓటమికి ముఖ్య కారణం బ్యాటింగ్. 130, 140 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది. దాంతో జట్టు బ్యాటింగ్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఈ ఏడాది ఆ విమర్శలకు చెక్ పెట్టాలని లెజెండ్ యూ రంగం లోకి దించింది. ఐపీఎల్ 2022 లో బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా ను నియమించింది సన్ రైజర్స్. చూడాలి మరి లారా తన బాధ్యతలను ఏ మేర సఫలం చేస్తూ… సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మార్పులు తెస్తాడు అనేది.
