హైదరాబాద్ సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. 3 ఇడియట్స్ నటుడు అఖిల్ మిశ్రా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు.. ఆయన మరణవార్త తో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆయన మరణంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా అతనితో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు..
మీడియా కథనాల ప్రకారం.. నటుడు వంటగదిలో పని చేస్తూ జారిపడ్డాడు. అతను వంటగదిలోని నేలపై గాయపడి ఆసుపత్రిలో మరణించాడని IANSకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అఖిల్‌కు జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ భార్య. అఖిల్ తుది శ్వాస విడిచే సమయంలో ఆమె హైదరాబాద్‌లో ఉన్నారు.. ఆయన మరణ వార్తను విని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది..
ఇక సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అఖిల్ మిశ్రా మృతిపై సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసింది… అఖిల్ ఉత్తరాన్, ఉడాన్, సిఐడి, శ్రీమాన్ శ్రీమతి, హతీమ్వంటి ఇతర ప్రముఖ టెలివిజన్ షోలలో కూడా భాగమయ్యాడు. కొన్నేళ్లుగా, అఖిల్ డాన్, గాంధీ, మై ఫాదర్, శిఖర్, కమ్లా కీ మౌత్, వెల్ డన్ అబ్బా వంటి చిత్రాలలో కూడా కనిపించాడు.. కొద్ది రోజుల క్రితం, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు… కొద్ది రోజుల్లోనే మరణించడం తో ఆయన అభిమానులను కలచివేస్తుంది.. అఖిల్, సుజానే లకు సెప్టెంబరు 2011లో సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.. క్రమ్ చిత్రం మరియు మేరా దిల్ దేవానా అనే టీవీ సిరీస్‌లో కలిసి పనిచేశారు.. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం..
