బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ వారి వారి రంగాల్లో ఎంతో కొంత గుర్తింపు, గౌరవం ఉన్నవారే. అయితే విభిన్న నేపథ్యాన్ని, మనస్తత్వాన్ని కలిగిన వారు కావడంతో వారి ఆలోచనా విధానంలోని వైరుధ్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం నాగార్జున సిరికి ఏ విషయంలో అయితే క్లాస్ పీకాడో… అదే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది సోమవారం బిగ్ బాస్ హౌస్ లో మరోసారి చోటు చేసుకుంది. ‘వాల్ ఆఫ్ షేమ్’లో భాగంగా ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ఆ సమయంలో ప్రియ… లహరి, సన్ని లను నామినేట్ చేసింది. ‘మగవాళ్ళతో మాట్లాడుతూ లహరి బిజీగా ఉంటుంది’ అనే ఆరోపణ ప్రియా చేసినప్పుడు రవి, సన్ని దాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ మహిళను అలా కించపరచడం తగదని వాదనకు దిగారు. మిడ్ నైట్, అందరూ నిద్ర పోతున్నప్పుడు రవి, లహరి హగ్ చేసుకోవడం తాను చూశానని ప్రియా అనే సరికీ లహరి సైతం ఆవేశం, ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియా మాటలతో తమ ఫ్యామిలీ మెంబర్స్ కు తమపై రాంగ్ ఇంప్రషన్ పడే ఆస్కారం ఉందని రవి వాదించాడు. ప్రియా చివరకు లహరికి క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేసినా… ఈ వివాదానికి సోమవారం అయితే ముగింపు పడలేదు.
నిజానికి 14వ రోజు రాత్రే ఇద్దరు ముగ్గురు ఒకచోట చేరి, వేరే వారి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. శ్రీరామ్, హమీదా తమ మనసులోని మాటను పంచుకోగా, రవి అండ్ ప్రియా, మానస్ కాజల్ ఒకచోట చేరి ఇతరుల ప్రవర్తనను ఎనలైజ్ చేశారు. విశ్వ కెప్టెన్ అయిన తర్వాత మారిపోయాడని ఒకరంటే, షణ్ముఖ్ పనిదొంగ అని, హమీదా ఈ మధ్య కాలంలో ఆర్డర్స్ ఎక్కువ వేస్తోందని మరొకరు అన్నారు.
సోమవారం ఉదయం… ఆర్జే కాజల్ కోరిక మేరకు బిగ్ బాస్ హౌస్ లోకి మటన్ బిర్యానీకి కావలసిన సరుకులను పంపారు. ఇతరుల సహాయంతో కాజల్ మాత్రమే బిర్యానీ చేయాలంటూ బిగ్ బాస్ మరోసారి గుర్తు చేశాడు. సుష్ఠుగా భోజనాలకు కానిచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. మధ్యాహ్నాం నిద్రపోయినందుకు షణ్ముఖ్ ను 21 సార్లు స్విమ్మింగ్ పూల్ లో మునిగి రావాలంటూ కెప్టెన్ విశ్వ ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత జరిగిన ‘వాల్ ఆఫ్ షేమ్’ వాదోపవాదాలతో రక్తి కట్టింది.
ఇందులో శ్రీరామ్ మానస్, రవిని; సిరి శ్వేత, లహరిని; సన్నీ ప్రియ, కాజల్ ను; నటరాజ్ సిరి, కాజల్ ను; యానీ శ్రీరామ్, మానస్ ను; రవి శ్రీరామ్, జస్వంత్ ను; లహరి ప్రియ, శ్రీరామ్ ను; లోబో ప్రియాంక, శ్రీరామ్ ను; ప్రియాంక లోబో, జస్వంత్ ను; మానస్ శ్రీరామ్, రవిని నామినేట్ చేశారు. బ్లాక్ పలకపై ఎవరి పేరును నామినేట్ చేయాలనుకుంటే వారి ముద్రను దానిపై వేసి, సుత్తితో పగలకొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ సూచనలకు అనుగుణంగా తాము నామినేట్ చేయడానికి గత కారణాలను ఒక్కొక్కరూ వివరించారు. అయితే… ప్రియాతో రవి, సన్ని, లహరి చేసిన వాగ్వివాదం సుదీర్ఘంగా సాగడంతో… ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్రసారం బుధవారానికి వాయిదా పడింది. సో… బుధవారం బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 థర్డ్ ఎలిమినేషన్ కు ఎవరెవరు నామినేట్ అవుతారో తెలుస్తుంది.