ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన జెండా.. మువ్వన్నెల పతాకం మన జాతి ఔన్నత్యానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎక్కడుందో తెలుసా? నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జాతీయ జెండా ఆషామాషీగా లేదు. చాలా పెద్దది. జాతీయ జెండా 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మన జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో దీన్ని ప్రదర్శించారు. ఈ భారీ జెండాను ఖాదీతో తయారుచేయడం విశేషం.
ఇంతకుముందు లడఖ్‌లోని లేహ్‌లో అతి పెద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అప్పట్లో అదే అతిపెద్ద జాతీయ జెండాగా ఖ్యాతిపొందింది. 2021 అక్టోబర్ 02 న మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా లడఖ్‌లోని లేహ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈజాతీయ జెండాను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మాథుర్ ఎగురవేశారు.
Also Read

ఖాదీ గ్రామం, పరిశ్రమల కమిషన్‌కు అనుబంధంగా ఉన్న ముంబైలో ఉన్న ఖాదీ డైయర్స్ ప్రింటర్స్ ఈ జెండాను తయారు చేశారు. ముంబై నుండి లేహ్‌కు జాతీయ జెండాను తీసుకువచ్చే బాధ్యత, ఆవిష్కరణ వేడుక కోసం ఎత్తైన పర్వతాల పైభాగంలో దాన్ని ఇన్‌స్టాల్ చేసే బాధ్యతను కూడా సూరా-సోయి ఇంజనీర్ రెజిమెంట్‌కు అప్పగించారు. ఈ త్రివర్ణం 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కలిగి వుంది. దీని బరువు దాదాపు 1,000 కిలోలు. ఈ జెండా కంటే ఇప్పుడు ముంబైలో ప్రదర్శించిన జాతీయ జెండా బరువు 400 కేజీలు ఎక్కువ. పొడవు, వెడల్పు సమానమే.
తాజావార్తలు
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?