బిగ్‌బాస్-5 పదో వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. పదో వారం కోసం సోమవారం రాత్రికి నామినేషన్‌ల ప్రక్రియ జరగనుంది. పదో వారంలో ఐదుగురు నామినేషన్‌లలో ఉండనున్నారు. వీరిలో రవి, కాజల్, సిరి, సన్నీ, మానస్ ఉన్నారు. ఈ వారం నామినేషన్‌ల ప్రక్రియ భిన్నంగా సాగనుంది. ఇందులో భాగంగా కెప్టెన్ యానీ నలుగురిని సెలక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేస్తుంది. ఈ జాబితాలో సన్నీ, మానస్, కాజల్, షణ్ముఖ్ ఉన్నారు.
Read Also: అల్లు వారసుడొచ్చేశాడు.. బన్నీ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ..?
అయితే బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం బజర్ మోగిన వెంటనే ఎవరు ముందుగా వెళ్లి తాళం తీసుకుంటారో వాళ్లు జైలు ఓపెన్ చేసి ఒకరిని బయటకు తీసుకురావచ్చు. అలా బయటకు వచ్చిన వారు ఎవరిని నామినేట్ చేస్తారో వారు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్‌గా జైల్లో ఎవరు మిగులుతారో వారే నామినేషన్‌లలో ఉండనున్నారు. ఆట మొదలు కాగానే తొలుత పింకీ తాళాలు తీసుకుని మానస్‌ను జైలు నుంచి బయటకు తెస్తుంది. అప్పుడు మానస్.. రవి, జెస్సీని నామినేట్ చేయడంతో వీళ్లిద్దరూ జైల్లోకి వెళ్లారు. ఆ తర్వాత తాళాలు దక్కించుకున్న సిరి… షణ్ముఖ్‌కు సారీ చెప్పి జస్సీని బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జెస్సీ షణ్ముఖ్‌ను సేవ్ చేయడంతో.. షణ్ముఖ్ ప్రియాంకను నామినేట్ చేశాడు. అయితే మిగతా సభ్యుల్లో కొందరు ప్రియాంకను సేవ్ చేసి రవి, మానస్‌ను నామినేట్ చేస్తారు.