కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. అయితే, వ్యాక్సిన్ పంపిణీలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని రికార్డుకెక్కింది.. సిటీలోని 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేసింది.. అదనంగా దాదాపు లక్ష మంది వలస కార్మికులకు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా అందించారు.. ఈ విషయాన్ని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ అన్షుమన్ రాత్ వెల్లడించారు..
భువనేశ్వర్ కార్పొరేషన్‌లో జులై 31 నాటికి తన జనాభాలో ఒక శాతం మందికి రోగనిరోధక శక్తిని అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సమయంలో, మేం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మొత్తం 9,07,000 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశాం.. అందులో దాదాపు 31,000 మంది ఆరోగ్య కార్యకర్తలు, 33,000 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 5,17,000 మంది 18-45 వయస్సువారు.. 3,20,000 మంది 45 ఏళ్లు దాటినవారు ఉన్నారని తెలిపారు అధికారులు.. నివేదికల ప్రకారం, జూలై 30 వరకు దాదాపు 18,35,000 డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. వేగంగా వ్యాక్సినేషన్ కోసం భువనేశ్వర్ లో 55 టీకా కేంద్రాలు ఏర్పాటు చేశాం.. వీటిలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇక, కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను విజయవంతం చేసినందున మున్సిపల్ కొర్పారేషన్ తరపున భువనేశ్వర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అధికారులు.. ఇక, భారత్‌లోనే 100 శాతం మందికి వ్యాక్సిన్ అందించిన తొలి సిటీగా నిలిచింది భువనేశ్వర్.
