Site icon NTV Telugu

బీమ్లానాయ‌క్ సెకండ్ సింగిల్… సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన బీమ్లా నాయ‌క్ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ను విజ‌య‌ద‌శ‌మి రోజున రిలీజ్ చేశారు.  అంతఇష్టం అనే టైటిల్ తో కూడిన సాంగ్ పూర్తి మెలోడీగా శ్రీకాకుళం యాస‌తో సాగింది.  ఈ సాంగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న‌ది.  బీమ్లా నాయ‌క్ టైటిల్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టిస్తుండ‌గా, రానా కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇందులో పవ‌న్ కు జోడిగా నిత్యామీన‌న్ న‌టిస్తున్నది.  త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించారు.  సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.  

Read: ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన క‌రోనా కేసులు…

Exit mobile version