Site icon NTV Telugu

నవవధువు భార్గవి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. భార్గవి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. దోమలగూడకు చెందిన భార్గవి ఈనెల 10న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. 200 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

Read Also: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం

మొత్తానికి భార్గవి మిస్సింగ్ కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. చివరకు ఆమె ఎక్కడికి వెళ్లిందో పోలీసులు కనిపెట్టారు. భార్గవి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. ఆమె తిరుపతిలో ఉందని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారు భార్గవి క్షేమసమాచారంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తిరుపతిలోని తన తండ్రి ఇంటికి భార్గవి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version