NTV Telugu Site icon

Balakrishna Fans: బాలయ్యా.. మజాకా..టపాసుల మోత మోగించిన ఫ్యాన్స్..

Balayya Fans

Balayya Fans

బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది.. బాలయ్య నటించిన ‘భగవత్ కేసరి ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. తమ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు.. థియేటర్లను అందంగా ముస్తాబుచేసి, బ్యానర్లు కట్టి, డబ్బుల మోత మోగించి, టపాసులు కాలుస్తూ సంబరంలా జరుపుకుంటారు. టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ వాతావరణం కనిపిస్తుంది. కానీ, ‘భగవంత్ కేసరి.. సినిమాకు బెంగళూరులో ఇలాంటి వాతావరణం కనిపించడం మామూలు విషయం కాదు..

బెంగళూరులోని మార్తహళ్లిలో ఉన్న వినాయక థియేటర్‌లో ‘భగవంత్ కేసరి’ సినిమా విడుదలైంది. అర్ధరాత్రి దాటిన తరవాత ఒంటి గంటకు ‘భగవంత్ కేసరి’ స్పెషల్ షో వేశారు. ఈ షోకి భారీగా తరలివచ్చిన బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు.. థియేటర్ వద్ద టపాసుల మోత మోగించారు.. బాలయ్య సినిమా సూపర్ హిట్ అంటూ సంబరాలను చేసుకున్నారు.. దీపావళికి ముందే టపాసులతో కనువిందు చేశారు.. ప్రస్తుతం ఈ సంబరాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్తహళ్లిలో ఎక్కువగా తెలుగువాళ్లే ఉంటారు. అందులోనూ ఇక్కడ టీడీపీ మద్దతుదారులు కూడా ఎక్కువట. అలాగే, ఏపీ నుంచి వెళ్లి బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఎక్కువగా మార్తహళ్లిలోనే నివసిస్తారట.. ఇక బాలయ్య బాబు సినిమా వస్తుందంటే ఆగుతారా.. తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకున్నారు..

ఇకపోతే భగవంత్ కేసరి సినిమాకు ప్రస్తుతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విదేశాల్లో, ఇక్కడ సినిమా చూసినవాళ్లు ఎక్స్ ద్వారా స్పందిస్తున్నారు. బాలయ్య సినిమాకు ప్రస్తుతానికి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అయినప్పటికీ బీ, సీ సెంటర్లలో సినిమా ఆడేస్తుందని అంటున్నారు. బాలయ్యను అనిల్ రావిపూడి కొత్తగా చూపించారని.. కొత్త బాలయ్యని చూపించారని సినిమాను చూసిన జనం చెబుతున్నారు..ఇక బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, కూతుళ్లుగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందట. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈయనకు ఇదే తొలి తెలుగు సినిమా. ఫస్ట్ మూవీకే ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక థమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. మొత్తానికి సినిమా సరికొత్తగా ఉందని, భారీ విజయాన్ని అందుకుంటుందని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..