Site icon NTV Telugu

బిజేపిలోకి ఈటల : బండి సంజయ్ క్లారిటీ

ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు. రెండు రోజుల్లో ఏ తేదీన ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతాడనే దానిపై క్లారిటీ వస్తుందని రాష్ట్ర నాయకత్వం పేర్కొంది..ఈటలకు హామీపై ఎలాంటి చర్చ జరగలేదని.. ఆయన ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు చేరాలి అనే దానిపై కేంద్ర బీజేపీ నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చింది…

Exit mobile version