Site icon NTV Telugu

ఈ నెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్

తెలంగాణలో యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యువత ఉద్యమం కోసం బలిదానం చేసుకుంది… ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ది కోసం తాము ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడారో గుర్తుచేస్తున్నామన్నారు. అప్పుడేం చెప్పావ్.. ఇప్పుడేం చేస్తున్నావ్ అన్నారు బండి సంజయ్. ఎంత మంది బలిదానం చేసుకుంటే నీ కళ్ళు చల్లబడతాయో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఎవరూ ఆత్మహత్య లు చేసుకోవద్దని హితవు పలికారు. క్షణికావేశంతో తల్లి దండ్రులను బాధ పెట్టొద్దన్నారు.

పక్క రాష్ట్రము ఏమి చేస్తుంది… కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని అడగడం కాదు.. నువ్వేమి చేసావో చెప్పాలన్నారు. ప్రగతి భవన్ లో, ఫాం హౌస్ లో ఉండడానికి కాదు నిన్ను ముఖ్యమంత్రి ని చేసింది. నిరుద్యోగుల బాగోగులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ నెల 16 న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. చిక్కడ పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిరుద్యోగులతో మాట్లాడిన సంజయ్. బీజేపీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో మాటామంతి జరిపారు.

Exit mobile version