NTV Telugu Site icon

రికార్డు స్థాయిలో బాలాపూర్ ల‌డ్డూవేలం…

గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో బాలాపూర్ గ‌ణ‌ప‌తికి ఓ ప్ర‌త్యేకత ఉంటుంది.  ప్ర‌తీ ఏడాది బాలాపూర్ గ‌ణ‌ప‌తి ల‌డ్డూను వేలం వేస్తారు.  2019లో రూ.17 ల‌క్ష‌ల‌కు పైగా ప‌లికిన బాలాపూర్ ల‌డ్డూ, ఈ ఏడాది మ‌రింత అధిక ధ‌ర‌ను సొంతం చేసుకుంది.  బాలాపూర్ ల‌డ్డూ వేలంలో క‌డ‌ప జిల్లాకు చెందిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌లు రూ.18.90 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్నారు.  ఈ ల‌డ్డూను త్వ‌ర‌లోనే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేస్తామ‌ని తెలిపారు.  ఈ వేలంలో ల‌డ్డూను ద‌క్కించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, ఏపీలోని 13 జిల్లాల ప్ర‌జ‌ల త‌ర‌పున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అందిస్తామ‌ని తెలిపారు.  తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాలాపూర్ గ‌ణ‌ప‌తిని కోరుకున్న‌ట్టు ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ పేర్కొన్నారు.  

Read: ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా సూపర్ స్టార్