Site icon NTV Telugu

కొత్త ఇల్లు కొనేవారికి శుభవార్త.. షరతులు ఇవే..!

పాత సంవత్సరానికి బైబై చెప్పి.. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం.. మరో రెండు రోజుల్లో 2022ను ఆహ్వానించబోతున్నాం.. అయితే, ఇప్పటి వరకు మీ సొంతిటి కల సహకారం కాకపోయినా చింత అవసరం లేదు.. ఎందుకంటే.. కొత్తగా ఇల్లు కొనేవారికి శుభవార్త చెప్పింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. నూతన సంవత్సరంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీకే హౌసింగ్‌ లోన్స్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.. కేవలం 6.65 శాతం వడ్డీ రేటుతో హోం లోన్స్‌ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్‌కు కొన్ని షరతులు కూడా పెట్టింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.

Read Also: చీప్ లిక్కర్‌ రూ.50కే..! ఇది బీజేపీ జాతీయ విధాన‌మా..?

హౌసింగ్‌ లోన్స్‌ కోసం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పెట్టిన నిబంధనలు గమనిస్తే.. దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. ఆ వ్యక్తి కనీసం మూడేళ్ల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబీబీఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్‌లో కనీసం మూడేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలని పేర్కొంది.. ఇక, చార్టర్డ్ అకౌంటెంట్లు అయితే ప్రాక్టీస్ సర్టిఫికేట్, మూడేల్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలని ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది.. సిబిల్ స్కోర్‌ 800పై ఉండాలని.. అప్పుడే హోం లోన్స్‌ 6.65 శాతం వడ్డీ రేటుకే లభిస్తాయని తెలిపింది.. ఇక, 750 నుంచి 799 మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉన్నవారు కూడా అదే వడ్డీ రేటును హోం లోన్స్‌ పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ లోన్‌ ఆఫర్స్‌కి డెడ్‌లైన్‌ కూడా పెట్టారు.. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు 26 జనవరి 2022 నాటికి కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. మంగళవారం నుంచి అంటే ఈ నెల 28వ తేదీ నుంచి 26 జనవరి 2022 మధ్య కాలంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్ సైట్‌లోదరఖాస్తు చేసుకొని.. ఫిబ్రవరి 25వ తేదీ నాటికి లోన్‌ తీసుకున్నవారికి మా్తరమే ఈ వడ్డీ రేటుపై లోన్స్‌ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా.. కొత్త ఇల్లు కొనాలని చూసేవారికి ఇది బంపరాఫరే.. కొత్త ఏడాదిలో తమ కలల సౌధాన్ని సొంతం చేసుకోవడానికి మంచి అవకాశం.

Exit mobile version