బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరిగింది. మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పోటీలో వున్నారు. ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7 సార్లు, టిడిపి 4 సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా, పి.ఎస్.పి, ఇండిపెండెంట్, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టి. జయరాములు 10,079 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి ఎన్.డి. విజయ జ్యోతిపై గెలుపొందారు. మొత్తం ఓటర్ల సంఖ్య- 2,04,618. ఈ అసెంబ్లీ పరిధిలో బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్.ఎ. కాసినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు మండలాలున్నాయి.
బద్వేల్ నియోజకవర్గంలో గత విజేతలు
2019 జి.వెంకటసుబ్బయ్య వైఎస్సార్సీపీ
2014 త్రివేది జయరాములు వైఎస్సార్సీపీ
2009 పీఎం కమలమ్మ కాంగ్రెస్
2004 దేవసాని చిన్న గోవింద రెడ్డి కాంగ్రెస్
2001 ఉప ఎన్నిక కొనిరెడ్డి విజయమ్మ టీడీపీ
1999 బిజివేముల వీరారెడ్డి టీడీపీ
1994 బిజివేముల వీరారెడ్డి టీడీపీ
1989 వడ్డెమాను శివరామక్రిష్ణారావు కాంగ్రెస్
1985 బిజివేముల వీరారెడ్డి టీడీపీ
1983 బిజివేముల వీరారెడ్డి ఐసీజే
1978 వడ్లమాను శివరామక్రిష్ణారావు జేఎన్పీ
1972 బిజివేముల వీరారెడ్డి కాంగ్రెస్
1967 బీవీ రెడ్డి కాంగ్రెస్
1962 వడ్డమాని చిదానందం ఎస్ డబ్ల్యు ఏ
1955 రత్నసభాపతి పెట్టి భండారు కాంగ్రెస్
1952 వి. చిదానందం ఇండిపెండెంట్