NTV Telugu Site icon

బ‌ద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి…కాసేప‌ట్లో లెక్కింపు ప్రారంభం

అక్టోబ‌ర్ 30 వ తేదీన క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగింది.  ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈరోజు వెలువ‌డ‌నున్నాయి.  ఈరోజు ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. బ‌ద్వేల్‌లోని బాల‌యోగి గురుకుల పాఠ‌శాల‌లో ఎన్నిక‌ల కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్ల‌ను అధికారులు ఇప్ప‌టికే పూర్తి చేశారు.  4 హాళ్ల‌లో మొత్తం 28 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.  ఒక్కో హాల్‌లో 7 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.  సూప‌ర్‌వైజ‌ర్‌, మైక్రో అబ్జ‌ర్వేట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కౌంటింగ్ జ‌ర‌గ‌నున్న‌ది.  

Read: నీట్‌ ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్

ఉద‌యం 7:30 గంట‌ల‌కు స్ట్రాంగ్ రూమ్‌ను తెర‌వ‌నున్నారు.  ఇక‌, ఉద‌యం 8 గంట‌ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. అనంత‌రం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.  మొత్తం 12 రౌండ్ల‌లో లెక్కింపు ఉండ‌బోతున్న‌ది.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పూర్తి ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  వైసీపీ, బీజేపీ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉన్న‌ది.  రెండు పార్టీలు పోటాపోటీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి.