Site icon NTV Telugu

ర్యాపిడోకి కోర్టులో ఎదురుదెబ్బ

కోర్టులో ర్యాపిడోకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే ప్రకటనా చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని ర్యాపిడోని కోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌ తన ప్లాట్‌ఫామ్‌ నుంచి పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్‌ చేయబడతారని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ ఈ ఆదేశాలను మీరితే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. దీంతో కొద్ది రోజులుగా కొనసాగుతోన్న వివాదానికి తెరపడింది. యాడ్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి నెటిజన్లు ర్యాపిడోపై కామెంట్లు గుప్పించారు. కోర్టు తీర్పుతో ర్యాపిడో కోసం అల్లు అర్జున్ వేసిన దోశ మాడిపోయిందంటూ పలువురు ఎద్దేవా చేశారు.

Exit mobile version