NTV Telugu Site icon

నవంబర్‌ 15న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Sabarimala

Sabarimala

మండల మకరవిళక్కు సీజన్‌ సందర్భంగా శబరిమల ఆలయాన్ని తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేవారం అంటే నవంబర్‌ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ప్రధానార్చకుడి సమక్షంలో మరో అర్చకుడు గర్బగుడిని తెరుస్తారు. పదహారో తేదీ నుంచి రెండు నెలలపాటు వర్చువల్‌ క్యూ విధానంలో రోజుకు 30 వేల మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. డిసెంబర్‌ 26న మండలపూజ ముగుస్తుంది. మకరవిళలక్కు కోసం డిసెంబర్‌ 30 మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14వ తేదీనా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.

ఆ తర్వాత ఆరు రోజులకు అంటే జనవరి 20వ తేదీనా తిరిగి ఆలయాన్ని మూసివేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి కఠిన నిబంధనలను అమలులో ఉంటాయని చెబుతున్నారు అధికారులు. టీకా తీసుకున్నవారు సర్టిఫికెట్‌ చూపించాలి. టీకా తీసుకోని వారు 72 గంటల ముందు చేయించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టు నెగెటీవ్‌ సర్టిఫికెట్‌ చూపించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాకే దర్శనానికి రావాలి. ఒరిజినల్‌ ఆధార్‌ తప్పని సరి వెంటతెచ్చుకోవాలి. పంపానదిలో స్నానానికి అనుమతి ఇచ్చినా, పంపా, సన్నిధానంలో బస చేసేందుకు అనుమతిలేదు. పంపాలో వాహనాల పార్కింగ్‌కు కూడా అనుమతిలేదు. దర్శనం ముగించుకున్న వెంటనే భక్తులు ఆలయ ప్రాంగణం విడిచివెళ్లాలి. నవంబర్‌ 3వ తేదీనా చిట్టచివరణ ఆలయాన్ని తెరిచారు. ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్నవారికి స్వామి దర్శనం దక్కింది. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం తొమ్మిందింటికి టెంపుల్‌ను మూసివేశారు.