అంతరిక్షంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఇతర గ్రహాల స్థితిగతులను అంచనా వేసేందుకు స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతరిక్ష కేంద్రంలో సభ్యదేశాలకు చెందిన పరిశోధకులు రోటేషన్ పద్ధతిలో పనిచేస్తుంటారు. వ్యోమగాములు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి మారుతుంటారు. అయితే, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన మనిషి భారరహిత స్థితికి చేరుకుంటారు.
Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్: మాస్క్ అప్‌గ్రేడ్…
ఆ సమయంలో తప్పని సరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండు గంటలసేపు స్పేస్ షిప్‌లోని జిమ్‌లో కసరత్తుల చేయాల్సిందేనట. భారరహిత స్థితిలో ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అనారోగ్యసమస్యల నుంచి విముక్తి పొందవచ్చని, సాధ్యమైనంత వరకు ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని వ్యోమగాములు చెబుతున్నారు.
Read: ఏలియన్స్ జాడ కోసం పూజారులతో నాసా కొత్త ప్రయత్నం…
అంతేకాదు, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన వ్యక్తులు కనీసం మూడు నుంచి ఆరు నెలలపాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. పెరిగిన జుట్టును వ్యాక్యుమ్‌తో కూడిన హెయిర్ కటింగ్ మిషిన్‌ను ఉపయోగించి కట్ చేస్తారట. నాసాకు చెందిన రాజాచారి వ్యోమగామి మౌరర్‌కు హెయిర్ కట్ చేశాడు. తెలుగువాడైన రాజాచారి నాసాలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేష్ సెంటర్‌లో మిషన్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలో జిమ్, హెయిర్ కటింగ్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.