Site icon NTV Telugu

కూతురికోసం 1200 మైళ్లు న‌డిచిన ఆర్మీ జ‌వాన్‌…

కూతురు ఎవ‌రికైనా కూతురే.  క‌న్న‌బిడ్డ‌కోసం త‌ల్లిదండ్రులు ఎంత క‌ష్టం ప‌డ‌టానికైనా స‌రే సాహ‌సిస్తారు.  త‌న చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాల‌నే త‌లంపుతో ఆర్మీజ‌వాన్ ఒట్టి కాళ్ల‌తో న‌డ‌క ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు. సీడిఎల్ఎస్ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధ‌ప‌డుతున్న‌ది.  జ‌న్య‌లోపం వ‌ల‌న ఇలాంటి సీడిఎల్ఎస్ వ్యాధి సంభ‌విస్తుంది.  ఈ వ్యాధికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చికిత్స లేక‌పోవ‌డంతో ఎలాగైనా స‌రే కాపాడుకోవ‌డానికి ఆ చిన్నారి తండ్రి బ్రాన్నింగ్ కంక‌ణం క‌ట్టుకున్నాడు.  హోప్ ఫ‌ర్ హ‌స్తి పేరుతో ఛారిటీని స్థాపించి కాలిన‌డ‌క‌న దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఫండింగ్ క‌లెక్ట్ చేస్తున్నాడు.  ఈ విరాలాల ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతో మ‌రీన్ ప్రాంతంలోని జాన్స‌న్ ల్యాబ‌రేట‌రీస్‌లో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఈ ప‌రిశోధ‌న‌లు ఫ‌లిస్తాయ‌ని, హ‌స్తి త‌ప్ప‌కుండా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Read: ఆయుర్థాయంపై క‌రోనా ప్ర‌భావం… భ‌య‌పెడుతున్న స‌ర్వే…

Exit mobile version