NTV Telugu Site icon

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే…

బీజేపీపై ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు.  బీజేపీ దేశంలో భార‌తీయ జ‌న‌కంట‌క పార్టీగా మారింద‌ని, కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ వ‌ర‌స‌గా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్ముతోంద‌ని విమ‌ర్శించారు.  మోడీపాల‌న‌కు వ్య‌తిరేకంగా బిలియ‌న్ మార్చ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.  ప్ర‌తీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పిన మోడీ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు.  ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తోంద‌ని, క్రీడ‌ల‌ను, క్రీడాకారుల‌ను సీఎం కేసీఆర్ ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిపారు.  ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో స్టేడియంలు నిర్మిస్తున్నార‌ని అన్నారు.  విద్యా ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వం క్రీడాకారుల‌కు 2శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ట్టు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  

Read: చైనా ఫోన్ల‌పై నిషేదం… ఇదే కార‌ణం…