Site icon NTV Telugu

వీడియో: కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన ఏపీ స్పీకర్

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు.

Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత

ఈ ఘటనలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా నియోజకవర్గ స్థాయిలో సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్‌ను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.

Exit mobile version