Site icon NTV Telugu

రేషన్ డీలర్ల బంద్‌పై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో మంగళవారం నుంచి రేషన్ పంపిణీని నిలిపివేసినట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. అయితే రేషన్ డీలర్ల బంద్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన.. రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: దేశంలో 13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం

సీఎం జగన్ ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని.. వాటి ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఏపీలో బైపాస్ పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడించారు. రేషన్ డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అంతేకానీ రేషన్ పంపిణీని నిలిపివేసి ప్రజలను బాధపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.

Exit mobile version