Site icon NTV Telugu

సినిమా టికెట్ రేట్లపై నిర్మాతలకు ఊరట

ఏపీలో సినిమా టికెట్ ధరలపై నిర్మాతలకు ఊరట కలిగించింది ఏపీ హైకోర్ట్. సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వ జీ.వో నెం. 35ను కొట్టేసింది హైకోర్టు. ఈమేరకు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది హైకోర్టు.గతంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో జారీచేసింది ఏపీ ప్రభుత్వం.

పాత రేట్లు వర్తిస్తాయని తెలిపిన కోర్ట్. ప్రభుత్వ వైఖరి త్వరలో వెల్లడి కానుంది. టికెట్ ధరలు పెంచడం అనేది డిస్ట్రిబ్యూటర్ల చేతిలో లేదు. ఆన్ లైన్‌లో టికెట్ రేట్లు ఎలా పెంచుతారో చూడాలి. పెద్ద సినిమాలకు సంబంధించిన ఆందోళన వ్యక్తం అవుతోంది. టికెట్ రేట్లకు సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. బెనిఫిట్ షోల విషయంలో ఎగ్జిబిటర్లు కోర్ట్‌కి వెళతారా అనేది చూడాలి. సంక్రాంతి లోపే ఒక నిర్ణయం తీసుకోనుంది.

Exit mobile version