NTV Telugu Site icon

కాకినాడ మేయ‌ర్ తొల‌గింపు: ఏపీ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల‌…

కాకినాడ మేయ‌ర్‌పై ఇటీవ‌ల అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే.  ఈ అవిశ్వాస తీర్మానంలో స‌భ్యుల విశ్వాసం కోల్పోవ‌డంతో పావ‌ని మేయ‌ర్ ప‌ద‌విని కోల్పోయారు.  అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయ‌ర్ గ‌తంలో కోర్టుకు వెళ్లారు.  తీర్మానం ప్ర‌వేశ పెట్టి ఓటింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ, ఆ ఫ‌లితాల‌ను ఈనెల 22 వ‌ర‌కు ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని హైకోర్టు పేర్కొన్న‌ది.  కానీ, ఇప్పుడు రాష్ట్ర‌ప్ర‌భుత్వం హ‌డావుడిగా కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది.  దీనిపై మండిప‌డ్డ పావ‌ని, కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ అవుతుంద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం ద్వారా మేయ‌ర్ ప‌ద‌వినుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ తాను మేయ‌ర్  హోదాలోనే కొన‌సాగుతాన‌ని అన్నారు.  

Read: హుజురాబాద్: ఉప ఎన్నికపై భారీ నిఘా…