నా చర్మంతో సీఎం వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తాజాగా ఆయన శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇక, వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు.. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు వచ్చాయి.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. మా దళితులకు రాజకీయంగా, ఆర్ధికంగా నిజమైన స్వాతంత్రం వచ్చింది సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అన్నారు. నా చర్మంతో జగన్ కి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేను అన్నారు.
Read Also: కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ.. ఆ పని చేయండి..!
ఇక, వైఎస్ జగన్ నాకు ఒక చరిత్ర సృష్టించాడు అని వ్యాఖ్యానించిన నారాయణస్వామి… సీఎం జగన్ మానవత్వం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దళితులకు వ్యక్తిగతంగా అభివృద్ది చేసేవిగా వివరించారు.. సీఎం జగన్ పాలనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని ప్రశంసలు కురిపించిన ఆయన.. దళితులను చంద్రబాబులాగా సీఎం జగన్ అవమానించారా? అని ప్రశ్నించారు.. వచ్చే ఏడాది నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయమని సీఎం జగన్ కు చెప్పానని.. ఆయన సానుకులంగా స్పందించారని ఈ సందర్భంగా వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.