NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టుగా త‌గ్గి తిరిగి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 1337 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,38,690కి చేరింది. ఇందులో 20,09,921 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 14,699 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 14,070కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, చిత్తూరులో 231, ప‌శ్చిమ గోదావ‌రిలో 198, గుంటూరులో 141, కృష్ణాలో 144, నెల్లూరులో 139, ప్ర‌కాశంలో 161, ప‌శ్చిమ గోదావ‌రిలో 128 కేసులు న‌మోద‌య్యాయి.

Read: అమ‌రీంద‌ర్ వ్యాఖ్య‌ల‌పై రేగుతున్న దుమారం: కాంగ్రెస్ పై పెరుగుతున్న ఒత్తిడి…