Site icon NTV Telugu

నేడు త‌ణుకులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌…

ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  జ‌గ‌నన్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు.  ఉద‌యం 10:30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు తణుకు చేరుకుంటారు.  త‌ణుకులో జ‌గ‌నన్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు.  ఆ త‌రువాత జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు జ‌గ‌న్ హాజ‌ర‌య్యి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.  

Read: భార‌త్ బ‌యోటెక్ బూస్ట‌ర్ డోస్‌… ఇంజెక్ష‌న్ రూపంలో కాకుండా…

అనంత‌రం మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు తణుకు నుంచి తాడేప‌ల్లికి ప్ర‌యాణం అవుతారు.  ఈ ప‌థకం ద్వారా సుమారు 52 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూర‌నున్న‌ది.  వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ లో డ‌బ్బులు క‌ట్టిన 8.26 ల‌క్ష‌ల మందికి ఈరోజు రిజిస్ట్రేష‌న్ ప‌త్రాల‌ను ఇవ్వ‌నున్నారు.  ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు 10వేల కోట్ల రూపాయ‌ల రుణ‌మాఫి, 6000 స్టాంపు డ్యూటీ మిన‌హాయింపు ల‌భిస్తుంది.  

Exit mobile version