Site icon NTV Telugu

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. 50.58 లక్షల మందికి లబ్ధి..

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం.. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.. మూడో విడతలో మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్..

Read Also: సీఎం జగన్‌ హస్తినబాట.. ప్రధానితో భేటీకి ప్రాధాన్యత..!

2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించింది సర్కార్.. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.. వరసగా మూడో ఏడాది, మూడో విడతగా రైతు భరోసా సహాయాన్ని అందించనుంది ఏపీ సర్కార్.. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు ప్రయోజనం చేకూరనుంది..

Exit mobile version