Site icon NTV Telugu

ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 

ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది.  ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు.  అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2021-22 సంవ‌త్స‌రానికిగాను వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.2,29,779.21 కోట్లు.  వెన‌క బ‌డిన కులాల‌కు బ‌డ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు.  ఇక ఏ రంగానికి ఎంతెంత బ‌డ్జెట్ కేటాయించారో ఇప్పుడు చూద్దాం.  
ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు.
కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు.
బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.359 కోట్లు.
ఎస్సీ స‌బ్ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు.
ఎస్టీ స‌బ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు.
మైనారిటీ యాక్ష‌న్ ప్లాన్‌కు రూ.3,840 కోట్లు.
చిన్నారుల కోసం బ‌డ్జెట్‌లో రూ.16,748 కోట్లు.
మ‌హిళ‌ల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు.
వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌కు రూ.11,210 కోట్లు.
విద్యా ప‌థ‌కాల‌కు రూ.24,624 కోట్లు.
వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు.
వైఎస్.ఆర్ పెన్ష‌న్ కానుక‌కు రూ.17,000 కోట్లు
వైఎస్ ఆర్ రైతు భ‌రోసాకు రూ.3,845 కోట్లు.
జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ.2500 కోట్లు.
జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ.2,223.15 కోట్లు

వైఎస్ఆర్-పీఎం ఫసల్ భీమా యోజనకు రూ.1802 కోట్లు. డ్వాక్రా సంఘాలకు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ కింద రూ. 865 కోట్లు. పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు. రైతులకు సున్నా వడ్డీ కింద రూ.500 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు. వివిధ పథకాల కింద కాపు సామాజిక సంక్షేమానికి రూ.3,306 కోట్లు. వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు. వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకానికి రూ.285 కోట్లు. వైఎస్సాఆర్ నేతన్న నేస్తం పథకానికి రూ.190 కోట్లు. వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా కింద రూ.120 కోట్లు మత్స్యకారుల డీజీల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.200 కోట్లు రైతులకు ఎక్స్ గ్రేషియాకు రూ.20 కోట్లు. లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు ఈబీసీ నేస్తం కింద రూ.500 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా కోసం రూ. 6337 కోట్లు. అమ్మఒడి కోసం రూ.6,107 కోట్లు వైఎస్సాఆర్ చేయూత కోసం రూ.4455 కోట్లు రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు. వైఎస్ ఆర్ టెస్టింగ్ ల్యాబ్ లకు రూ.88.57 కోట్లు. వైఎస్ఆర్ ఉచిత భీమా పంటల పధకానికి రూ.1802.82 కోట్లు.  వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ కోసం రూ.739.46 కోట్లు. వైఎస్సాఆర్ పశువుల నష్టపరిహారం పథకానికి రూ.50 కోట్లు. విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లుస్కూళ్లలో నాడు నేడు కోసం రూ.3500 కోట్లు. జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు జగనన్న విద్య కానుక కోసం రూ.750 కోట్లు ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు.  

Exit mobile version