టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7న సంక్రాంతి వేడుకలకు మరింత ఉత్సహాంగా జరుపుకునేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ రోజు దీపావళి కానుకగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విడివిడిగా కనిపించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఈ వీడియో కలిసి కనిపించారు.
అయితే ఈ దీపావళికి మరిన్ని టపాసులు కాల్చుకోండి అంటూ రేపు సాయంత్రం ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌కు సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.