Site icon NTV Telugu

వైర‌ల్‌: పెళ్లిపీట‌ల‌పైనే వరుడి చెంప ప‌గ‌ల‌గొట్టిన వధువు… ఎందుకంటే…

పెళ్లి ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఓ మ‌ధురానుభూతిగా మిగిలిపోతుంది.  పెళ్లి తంతు జ‌రిగే స‌మ‌యంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయి.  కొన్ని స‌ర‌దాగా ఉంటే మ‌రికొన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి.  అయితే, కొన్నిసార్లు తెలియ‌కుండా వివాహం జ‌రిగే స‌మ‌యంతో తప్పులు చేస్తుంటారు.  ఇలానే పెళ్లి కొడుకు పెళ్లిపీట‌ల‌పై ఉండ‌గానే త‌ప్పుచేశాడు.  అంతే, ఆ వ‌ధువుకు ఎక్క‌డాలేని కోపం వ‌చ్చేసింది.  ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వ‌రుడి చెంప చెళ్లుమ‌నిపించింది.  పెళ్లి వేడుక‌ను చూస్తున్న‌వ్య‌క్తులు ఏమీ మాట్ల‌డ‌లేదు.  ఇంత‌కీ ఆ వ‌రుడు చేసి త‌ప్పు ఎంటి అంటే పొగాకు న‌మ‌ల‌డం.  పొగాకు చాలా డేంజ‌ర్.  ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.  పొగాకు న‌మిలితే నోటి క్యాన్స‌ర్ వ‌స్తుంది.  తెలిసి కూడా కొంత‌మంది మానుకోలేక న‌ములుతూనే ఉంటారు.  పెళ్లి జ‌రిగే స‌మ‌యంలో కూడా వ‌రుడు అలానే పొగాకు న‌మ‌ల‌డంతో కొపం త‌ట్టుకోలేక ఒక్క‌టిచ్చింది.  ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

 Read: పాక్ మెడకు కాబూల్ పేలుళ్ల ఉచ్చు… అక్కడి నుంచే స‌ర‌ఫ‌రా…

Exit mobile version