NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో  55,251 శాంపిల్స్‌ను ప‌రిక్షించ‌గా 1171 మంది పాజిటివ్‌గా తేలింది.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,43,244కి చేరింది.  ఇందులో 20,15,387 మంది కోలుకొని ఇప్ప‌టికే డిశ్చార్జ్ అయ్యారు.  13,749 కేసులు ప్ర‌స్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనాతో 11 మంది మృతి చెందిన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 14,108 మంది మృతి చెందారు.  చిత్తూరు జిల్లాలో 158 కేసులు, తూర్పుగోదావ‌రి జిల్లాలో 155 కేసులు, గుంటూరులో 101 కేసులు, కృష్ణాజిల్లాలో 147 కేసులు, నెల్లూరు జిల్లాలో 145 కేసులు, ప్ర‌కాశం జిల్లాలో 141 కేసులు న‌మోద‌య్యాయి.  

Read: అకూస్ కూట‌మిపై అగ్ర‌రాజ్యం క్లారిటీ…ఇండియా ఆ కూట‌మిలో చేరుతుందా?