ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటమే కాదు ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచించే విధంగా ఉంటాయి. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. పల్సర్ బండిపై వెనక కూర్చోని దర్జాగా పోతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవర్ లేకుండానే పల్సర్ బండి పోతున్నది. ఈ బండిని చూస్తే ఎలన్ మస్క్ ఆశ్చర్యపోతాడేమో అని ట్వీట్ చేశారు. డ్రైవర్ లేకుండా సాగే ప్రయాణం నాది…నాకు గమ్యం కూడా లేదు అని ట్వీట్ చేశారు. ఎలన్ మస్క్ డ్రైవర్ లేకుండా నడిచే కార్లను విపణిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. భారత్‌లో డ్రైవర్ లేకుండానే ద్విచక్రవాహనాలు నడుస్తున్నాయని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది.
ఆనంద్ మహీంద్రా సరదా కామెంట్: ఎలన్ మస్క్‌కు భారత్ నుంచే పోటీ…
