వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేసే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయన సోస్ట్ చేసే వీడియోలు తప్పకుండా వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రిస్మస్ వేడుకలపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. లక్షల పదాల కంటే చిన్న వీడియో చాలా శక్తివంతమైనదని, హంగు ఆర్బాటం, ఆడంబరాలు లేకున్నా పిల్లలు చేసుకుంటున్న క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పవని అన్నారు. ఆఫ్రికా ఖండంలోని పిల్లలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా క్రిస్మస్ వేడుకలను వారికి నచ్చిన విధంగా డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. సంతోషం అనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడులు అవసరం లేదని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బిట్ కాయిన్లు శాసించబోతున్నాయా?