ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వ్యక్తుల్లో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. మట్టిలోని మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ప్రతిభావంతుల గురించి ఆయన నిత్యం ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. కాగా, కొన్ని రోజుల క్రితం మణిపూర్ కు చెందిన ప్రేమ్ అనే యువకుడు చెత్త వ్యర్థ పదార్థాలతో ఐరన్ మ్యాన్‌ను తయారు చేశాడు.
Read: షాకిచ్చిన బీజేపీ.. కషాయం కండువా కప్పుకున్న నలుగురు ఎమ్మెల్సీలు..
ప్రేమ్ ప్రతిభను గుర్తించిన ఆనంద్ మహీంద్రా మెకానికల్ ఇంజనీరింగ్ చదివేందుకు సహకరిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మహీంద్రా హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయంలో చదివేందుకు అవకాశం కల్పించాడు. మణిపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సహకరించింది. ప్రేమ్ ప్రయాణానికి సహకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ కు ఆనంద్ మహీంద్రా కృతజ్ఞతలు తెలియజేశారు.