అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈరోజే తీసుకోండి. లేకపోతే రేపటి నుంచి రూ.500 ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్‌షిప్ ద్వారా అమెజాన్‌లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ మూవీస్, ప్రైమ్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ధర పెరగనుంది.
Read Also: ఫేస్‌బుక్ నుంచి సరికొత్త అప్‌డేట్
డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ ఏడాది మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.500 ఎక్కువగా చెల్లించాలి. అంటే రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ప్లాన్ తీసుకుంటే రూ.129 బదులు రూ.179 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల ప్లాన్ తీసుకుంటే.. రూ.329 బదులు రూ.459 చెల్లించాలి. అయితే ప్రస్తుతం ప్రైమ్ మెంబర్‌షిప్ వాడుతున్న సభ్యులపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండదని అమెజాన్ స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు ముగిసిన తర్వాతే.. కొత్త ధరలను వీరు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
