కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న నటీనటులు తీవ్రంగా కదిలిపోయారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో కలిసి వున్న ఫోటోలు షేర్ చేశారు బన్నీ.
ఖచ్చితంగా ఇది నాకు పెద్ద షాక్. ఆనష్టాన్ని మాటల్లో చెప్పలేను. నా పాత స్నేహితుడు పునీత్ గారు ఇక లేరు. మేము ఒకరికొకరం పరస్పర గౌరవం. ఇష్టంతో వుండేవాళ్ళం. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన పవిత్రమయని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ బన్నీ ట్వీట్ చేశారు.