కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేసిన నరేష్.. మధ్యకాలంలో అన్ని సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన నుంచి కామెడీ మూవీ చాలా రోజులే అయ్యింది. కామెడీ హీరో అనే ముద్ర నుంచి బయట పడడానికి ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలు సినిమాలు చేశాడు. అయితే, తన నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ చిత్రాలను మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. సీరియస్ రోల్స్ కి కొంచం విరామం ఇచ్చి.. మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కాలని డిసైడ్ అయ్యాడు.
Alsor Read: Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం
ప్రస్తుతం ఉగ్రం చిత్రంలో నటిస్తున్న నరేష్.. ఉగాది సందర్భంగా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు. కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తన 61వ సినిమా ద్వారా మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. అల్లరి నరేష్, ఫరియా జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇదే. అల్లరి నరేష్ కొత్త సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉంటుందని మూవీ టీం చెబుతోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. అబ్బూరి రవి డైలాగ్స్ రాయనుండగా, గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తారు.