Site icon NTV Telugu

పవన్ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ విశాఖపట్నం రానున్నారు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గం.కు సభ ప్రారంభమవుతుంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేస్తూ, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందించిన విషయం విదితమే. 34 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపుడుకుందామని ఉక్కు పరిరక్షణ సమితి దీక్షలు , ర్యాలీ , చేస్తున్నారు. ఈ సభపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు జనసేన నేతలు.

Exit mobile version