NTV Telugu Site icon

దక్షిణాది సీఎంల భేటీకి తిరుపతి రెడీ .. అమిత్ షా షెడ్యూల్ ఇదే

దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశానికి తిరుపతి నగరం సిద్ధమయింది. ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడినుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.

మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం 9.20 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 10.25 గంటలకు నెల్లూరు జిల్లాకు చేరుకుని మధ్యాహ్నం 12.55 వరకు అక్కడి స్థానిక కార్యక్రమాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి తిరుపతి ఏర్పోర్ట్ చేరుకొని అక్కడినుండి బయలుదేరి 2.40 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఈనెల 15వ తేదీ ఉదయం 7.30 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 8.10 గంటలకు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ చేరుకుని 10 గంటల నుండి 2.30 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 5.55 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు. అమిత్ షా 3 రోజుల తిరుపతి పర్యటన సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.