Site icon NTV Telugu

ఢిల్లీలో మ‌ళ్లీ పెరుగుతున్న వాయు కాలుష్యం…

క‌రోనా కార‌ణంగా చాలా కాలంపాటు ఆంక్ష‌లు కొనసాగ‌డంతో కాలుష్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. కాగా, ఆంక్ష‌లను చాలా వ‌ర‌కు ఎత్తివేశారు. రోడ్డుమీద‌కు వాహ‌నాలు తిరిగి ప‌రుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొద‌లైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాట‌డంతో ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ స‌రిహ‌ద్దుల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న‌ది. పంట వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేయ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Read: డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…

Exit mobile version