NTV Telugu Site icon

Air India: ఫ్లైట్ లో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. సిబ్బంది పై దాడి..

Aii

Aii

ఎయిర్ ఇండియా ప్లైట్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది.. ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది పై దాడి చేశాడు.. గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసింది..గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఏఐ 882 విమానంలో ఓ ప్రయాణికుడు బీభత్సం సృష్టించాడు. ఎయిర్ ఇండియా సిబ్బందితో ఆ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.. మొదట సిబ్బంది తో గొడవకు దిగిన ఆ వ్యక్తి తర్వాత దాడి చేశాడు..

విమానంలో ఉన్న ప్రయానికులు అతని ప్రవర్తనను చూసి భయఆందోళనకు గురవుతున్నారు..ఆ ప్రయాణికుడు గోవా నుంచి ఢిల్లీకి వెళ్లే వరకు నానా యాగీ చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. విమానం ఢిల్లీకి చేరిన తర్వాత కూడా ఆ ప్రయాణికుడి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది.. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు..

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది.. సిబ్బంది పై దాడిని తీవ్రంగా ఖండించింది.. సిబ్బందికి అన్నివిధాలా సాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇటీవల ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానంలోనూ ఓ ప్రయాణికుడు ఇలాంటి ఘటనే జరిగింది. ఏప్రిల్‌ 10 న జరిగిన ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళా క్యాబిన్‌ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎయిర్‌ ఇండియా సదరు వ్యక్తిపై నిషేధం విధించింది..ఇప్పుడు జరిగిన ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Show comments