సీడీఎస్ బిపిన్ రావత్ ప్రమాదం పై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా.. మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రమాదం పై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు.
హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మాట్లాడారు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై విచారణ సాగుతోందన్నారు. తగిన ఆధారాలు, సేకరించిన ఎవిడెన్స్ లభించిన తర్వాత మాట్లాడగలమన్నారు. రావత్ ఘటన పై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్ ను పరిశిలించాలి. ప్రతి సాక్షిని విచారించాలన్నారు. ఇందుకోసం వారాల సమయం పడుతుందన్నారు.
తూర్పు లఢక్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మెయింటేయిన్ చేస్తున్నాం. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయి. వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మల్టీ డైమన్షన్ వార్ లో పై దృష్టి సారించాలని కాడెట్స్ కు చెబుతున్నాం. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలన్నారు. ద్రోన్ దాడులను ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. యాంటి ద్రోన్ సిస్టమ్ లను ఏర్పాటుచేస్తున్నామన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ద్రోన్ దాడులనుండి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి.