Site icon NTV Telugu

దేశంలో మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… మొద‌టి ఎఫెక్ట్ ఆ న‌గ‌రంపైనే…

దేశంలో క‌రోనా కేసులు కొంత‌మేర త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ, కొత్త వేరియంట్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది.  కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో కేసులు పెరుగుతున్నాయి.  దేశంలో ఇప్ప‌టి వ‌రకు 77 ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ప్ర‌తిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది.  దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కిట్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది ప్ర‌భుత్వం.  జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి రిజ‌ల్డ్ వ‌చ్చేస‌రికి అల‌స్యం అవుతున్న‌ది.  ఈలోగా ఒమిక్రాన్ ఏవైనా ఉంటే అవి సామాజికంగా వ్యాపించ‌డం మొద‌లుపెడ‌తాయి.  ఇది చాలా డేంజ‌ర్‌.

Read: ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా మారిన బిలియ‌నిర్‌…

అలా అని లాక్ డౌన్ విధించ‌లేరు.  అయితే, ఆంక్ష‌ల‌ను విధించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో ఆంక్ష‌లు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌యింది మ‌హా ప్ర‌భుత్వం.  ఈరోజు నుంచి కొత్త ఆంక్ష‌లు అమ‌లులోకి రానున్నాయి. ముంబైలో వివాహాలు, వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉన్న‌ది.  ఈరోజు నుంచి 31 వ తేదీ వ‌ర‌కు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌బోతున్నారు.  గుంపులుగా తిర‌గొద్ద‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని అధికారులు చెబుతున్నారు.  అంతేకాదు, ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న‌ప్పుడు ఎంత‌మంది వీటిని ఫాలో అవుతున్నారు లేదో తెలుసుకోబోతున్నారు పోలీసులు.  

Exit mobile version