Site icon NTV Telugu

Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..

Jagadish Shettar

Jagadish Shettar

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ నిరాకరించినందుకు బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బీఎల్ సంతోష్‌పై జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. అత్యధిక ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నప్పుడు తనకు టికెట్ ఎందుకు నిరాకరించారని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక బీఎల్ సంతోష్ ఉన్నారని తాను నమ్ముతున్నాను అని అన్నారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. అలాంటి తనకు కాకుండా బీఎల్ సంతోష్ వేరే వారికి టికెట్ ఇప్పించారని శెట్టర్ ఆరోపించారు. తనను పావుగా చేసి గేమ్ ఆడారని పేర్కొన్నారు. టికెట్ నిరాకరించడంలో హైకమాండ్ ప్రమేయం లేదని బీఎల్ సంతోష్ ప్రతిదీ తప్పుగా కథ నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Accenture: 19000 ఉద్యోగాలు తొలగింపు.. ఫ్రెషర్స్ నియామకం ఆలస్యం

గత రెండేళ్లుగా పార్టీలో (బీజేపీ) అవమానాలు చవిచూశాను కాబట్టి కాంగ్రెస్‌లో చేరడం అనివార్యమైంది. వారు (బిజెపి) యువకుల కోసం చూస్తున్నట్లయితే, 72 ఏళ్లు పైబడిన వారికి ఎందుకు టిక్కెట్లు ఇచ్చారు? అని జగదీశ్ శెట్టర్ ప్రశ్నించారు. బీజేపీ ఇచ్చిన టికెట్లలో దాదాపు 20 మంది 75 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వకూడదో బీజేపీ చెప్పలేదన్నారు. గత ఆరు ఎన్నికల్లో 25 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాను అని గుర్తు చేశారు. ప్రజలు తనను ఆదరిస్తున్నారని, పార్టీ ఎందుకు తనను అవమానం చేసిందని అని మాజీ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టర్‌కు రాజ్యసభ బెర్త్ ఆఫర్ చేయబడుతుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే అతను దానిని ధృవీకరించలేదు. ఎటువంటి వివరణ లేకుండా శెట్టర్ ను ఎన్నికల్లో పోటీకి నిరాకరించడంతో లింగాయత్ మద్దతుదారులు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి శెట్టర్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. హుబ్లీ-ధార్వాడ్ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఆయన పోటీ చేయనున్నారు. అదే స్థానానికి బీజేపీ నుంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగింకైని రంగంలో దింపింది.

Exit mobile version